ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాను ఎదుర్కోవటానికి 'కస్టమైజ్డ్ క్రష్' శిక్షణా కార్యక్రమం - Collector Nivas participating in a video conference with the PM modi

కరోనా వైరస్​ వ్యాప్తి, నివారణ అంశాలపై ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్ పాల్గొన్నారు. కరోనాను ఎదుర్కోవటానికి కస్టమైజ్డ్ క్రష్​ పేరుతో శిక్షణా కార్యక్రమం ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా లక్ష మంది యువతకు ఈ శిక్షణను మూడు నెలల పాటు ఇస్తారని స్పష్టం చేశారు.

Collector Nivas
కలెక్టర్ నివాస్

By

Published : Jun 18, 2021, 7:12 PM IST

కరోనా వైరస్ కట్టడికి మరింత సన్నద్ధతగా ఉండాలని ప్రధాన మంత్రి తెలిపినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్ వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్​కు కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో తగినంత నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణ నివ్వాలని ప్రధానమంత్రి సూచించినట్లు కలెక్టర్ తెలిపారు. కస్టమైజ్డ్ క్రష్ కోర్సు పేరుతో శిక్షణా కార్యక్రమం ఉంటుందన్నారు. హోమ్ కేర్ సపోర్ట్ ,బేసిక్ కేర్ సపోర్ట్ ,అడ్వాన్స్​డ్ డే కేర్ సపోర్ట్ ,ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్ ,శాంపిల్ కేర్ సేకరణ ,వైద్య పరికరాలకు సంబంధించిన అంశాల్లో శిక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా లక్ష మంది యువతకు ఈ శిక్షణను మూడు నెలల పాటు ఇస్తారని తెలిపారు. ఆరోగ్య రంగంలో ఉన్న ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు ట్రైనింగ్ ఉపయోగపడుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details