ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల నిర్మాణ నిర్మాణ పనుల ప్రారంభానికి ఏర్పాట్లు.. - కృష్ణా జిల్లా కలెక్టర్

జూలై 1నుంచి 4 వరకు జరగనున్న పేదలకు ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్‌ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ అర్బన్ ప్రాంతానికి చెందిన 3,700 మంది లబ్ధిదారులకు పెనమలూరు మండలం వణుకూరులో కేటాయించిన ఇళ్ల లే అవుట్​ను, విజయవాడ రూరల్ మండలం నున్నలోని లేఔట్​ని పరిశీలించారు.

Housing Arrangments
ఇళ్ల నిర్మాణం

By

Published : Jun 27, 2021, 8:30 PM IST

కృష్ణా జిల్లాలో జూలై 1నుంచి 4వరకు జరగనున్న ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి కలెక్టర్​ అధ్యర్యంలోని యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. ఈ కార్యక్రమంలో పేదలకు నవరత్నాల కింద 48 వేల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించనున్నారు.

దీనికి సంబంధించి కలెక్టర్​ జే నివాస్​తో పాటు సంయుక్త కలెక్టర్లు..పలు ప్రాంతాల్లో పర్యటించి ఇళ్ల స్థలాల లే అవుట్​లలో మెగా హౌసింగ్​ మేళా నిర్వహణకు సన్నాహకాలు చేపట్టారు. విజయవాడ అర్బన్ ప్రాంతానికి చెందిన 3,700 మంది లబ్ధిదారులకు పెనమలూరు మండలం వణుకూరులో కేటాయించిన ఇళ్ల లే అవుట్ ను, విజయవాడ రూరల్ మండలం నున్న లోని లేఔట్ ను కలెక్టరు నివాస్‌ పరిశీలించారు.

జగ్గయ్యపేటలోని బలుసుపాడు రోడ్డు హౌసింగ్ లేఔట్ - 2లో లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తో కలిసి సంయుక్త కలెక్టర్ మాధవీలత పరిశీలించారు.

ఇదీ చదవండి:తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు పూర్తైతే.. ఎడారిగా ఏపీ: కొల్లు రవీంద్ర

ABOUT THE AUTHOR

...view details