కృష్ణా జిల్లాలో కేవలం ఐదు రోజుల్లోనే 450 కరోనా కేసులు నమోదయ్యాయని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. గతేడాదితో పోల్చుకుంటే ప్రస్తుతం కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతోందని చెప్పారు. కొవిడ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరారు.
టెస్టింగ్ , ట్రేసింగ్, ట్రీట్మెంట్ ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గిస్సున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా లక్షా 85 వేల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో లాక్ డౌన్ విధించే యోచన లేదని స్పష్టం చేశారు.