ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో కరోనా కట్టడికి ముందస్తు చర్యలు: కలెక్టర్ - collector helds conference on corona news

కృష్ణా జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పాలనాధికారి ఇంతియాజ్... ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు. జిల్లాలోని పలు ఆసుపత్రుల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

krishna district collector intiaz speaks about corona
కృష్ణా జిల్లాలో కరోనా కట్టడికి ముందస్తు చర్యలు

By

Published : Mar 19, 2020, 5:15 PM IST

జిల్లాలో కరోనా కట్టడికి ముందస్తు చర్యలు: కలెక్టర్

కరోనా వైరస్​ను నియంత్రించేందుకు కృష్ణా జిల్లా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను సర్వే ద్వారా గుర్తించి వారిని ఇంట్లోనే 24 రోజుల పాటు ఐసోలేట్​గా ఉండాలని సూచిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు వైద్యులు ప్రతీరోజూ వైద్య సేవలందిస్తున్నారు. రద్దీగా ఉండే పరిసరాలల్లో లిక్విడ్ స్ర్పే చేస్తున్నారు. జిల్లాలోని 17 ఆసుపత్రుల్లో 81 ఐసోలేషన్ వార్డులు అందుబాటులో ఉంచామని చెబుతున్న... కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్​తో 'ఈటీవిభారత్' ముఖాముఖి.

ఇదీ చదవండి:కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు

ABOUT THE AUTHOR

...view details