విజయవాడ కనకదుర్గమ్మ ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి... ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. భవానీపురం, కృష్ణాఘాట్ వద్ద పైవంతెన పనులను... జాతీయ రహదారి సంస్థ అధికారులు, నిర్మాణ సంస్థ సోమా ప్రాజెక్టు ప్రతినిధులతో కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పనులు చేపట్టాలని సూచించారు.
కనకదుర్గమ్మ ప్లై ఓవర్ బ్రిడ్జి పనుల పరిశీలన
విజయవాడ కనకదుర్గమ్మ ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్ పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేసి ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
కనకదుర్గమ్మ ప్లైఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన కలెక్టర్
నిర్మాణ పనుల కోసం 300 మంది కార్మికులను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా నిలిచిన పనులను 285 మంది కార్మికులతో పునరుద్ధరించామని... మరో రెండురోజుల్లో పనుల ప్రణాళికపై నివేదికను అందిస్తామని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు కలెక్టరుకు తెలిపారు.
ఇదీ చదవండి:దేశంలో రికార్డు స్థాయిలో 9,996 కేసులు, 357 మరణాలు