ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్​ ఇంతియాజ్​ - జగ్గయ్యపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి

జగ్గయ్యపేటలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న దృష్ట్యా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్​ ఎండీ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహించి వివరాలు సేకరించాలని కలెక్టర్ సూచించారు.

krishna district collector imtiaz
కలెక్టర్​ ఇంతియాజ్​

By

Published : Mar 17, 2021, 7:08 PM IST

కొన్ని రోజులుగా జగ్గయ్యపేట పట్టణంలో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జగ్గయ్యపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులతో కృష్ణా జిల్లా కలెక్టర్ ఎండీ ఇంతియాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, స్థానిక వైద్యులు, అధికారులతో కలిసి కరోనా ఉద్ధృతిపై ఆయన చర్చించారు.

కొవిడ్​ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్య బృందాలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని.. సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ వేస్తారని, ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సుహాసిని, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:పోటాపోటీగా గుంటూరు - కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు

ABOUT THE AUTHOR

...view details