కృష్ణాజిల్లాలో కరోనా వైరస్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతం 35 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. 307 మందికి సంబంధించిన వైద్య నివేదికలు రావాల్సి ఉందని వెల్లడించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు జిల్లా పరిస్థితిపై సమీక్షిస్తున్నారని తెలిపారు. కొవిడ్ అనుమానితులకు సంబంధించిన నమూనాలను పెద్ద సంఖ్యలో సేకరించి పరీక్షలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారన్నారు.
పెద్ద సంఖ్యలో నమూనాలు పరీక్షించనున్నాం: కలెక్టర్ ఇంతియాజ్ - కరోనాపై కృష్ణా జల్లా కలెక్టర్
రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో నమూనాలు సేకరించి కరోనా పరీక్షలు చేయనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా జిల్లావ్యాప్తంగా నమూనాలు సేకరించనున్నామని....రోజుకు 800 నుంచి 1000 నమూనాల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు
కరోనాపై కృష్ణా జల్లా కలెక్టర్
ఎక్కువ సంఖ్యలో నమూనాలు పరీక్షించేలా టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి రానున్నాయని..ఎవరికి ఎలాంటి అనుమానం ఉన్నా వచ్చి పరీక్షలు చేయించుకోవచ్చని ఇంతియాజ్ అన్నారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా జిల్లావ్యాప్తంగా నమూనాలు సేకరించనున్నామని....రోజుకు 800 నుంచి 1000 నమూనాల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ముందుగా రెడ్ జోన్ ప్రాంతాల్లో నమూనాలు సేకరించిన అనంతరం....జిల్లావ్యాప్తంగా సేకరిస్తామన్నారు.
ఇదీ చదవండి: బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే.. కేసులే