అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి కృష్ణా జిల్లా అవనిగడ్డ తెదేపా నేతలు సంఘీభావం ప్రకటించారు. వారికి మద్దతుగా అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. నేతలు మాట్లాడుతూ.. నేటితో అమరావతికి శంకుస్థాపన జరిగి 5 సంవత్సరాలు పూర్తయ్యాయన్నారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని నీరు గార్చిందని మండిపడ్డారు. గత 310 రోజులుగా రైతులు, మహిళలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చుకుని అమరావతిని కొనసాగించాలని కోరారు.
'అమరావతి కోసం రైతులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు' - అమరావతికి అవనిగడ్డ తెదేపా నేతల సంఘీభావం
అమరావతి రాజధాని కోసం రైతులు, మహిళలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారని.. కృష్ణా జిల్లా అవనిగడ్డ తెదేపా నేతలు అన్నారు. వారికి సంఘీభావం ప్రకటించి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
అమరావతికి తెదేపా నేతల మద్దతు