ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న రూ. 15 లక్షల 66 వేల నగదును కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీసులు పట్టుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.
ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న రూ. 15 లక్షల 66 వేలు పట్టివేత - రూ. 15 లక్షల నగదు పట్టివేత న్యూస్
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న రూ. 15 లక్షల 66 వేల నగదును కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీసులు పట్టుకున్నారు.
ఈ క్రమంలో అవనిగడ్డ నుంచి కోడూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై అనుమానంతో పోలీసులు.. వి. కొత్తపాలెం వద్ద వాహనాన్ని తనిఖీ చేశారు. ఉల్లిపాలెంకు చెందిన వీరి వద్ద రూ. 15 లక్షల 66 వేల నగదును పోలీసులు గుర్తించారు.
వివరాలను అడగగా.. పొలం అమ్మకం వలన వచ్చిన నగదుగా బదులిచ్చారని అవనిగడ్డ సీఐ బీబీ రవి కుమార్ తెలిపారు. నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో ఆ మొత్తాన్ని పరిశీలన నిమిత్తం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పంపించినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో కోడూరు ఎస్సై పి. రమేష్, ఇతర పొలీస్ సిబ్బంది పాల్గొన్నారు.