ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండేళ్ల కిందట హత్య... కేసును ఛేదించిన అవనిగడ్డ పోలీసులు - krishna district news

హంతకులు ఎన్ని ఎత్తులు వేసినా చివరకు చిక్కక తప్పదని మరోసారి నిరూపించారు అవనిగడ్డ పోలీసులు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంకలో రెండేళ్ల కిందట జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను గురువారం అరెస్టు చేశారు. మృతుడి డైరీ ఆధారంగా పోలీసులు హత్య మిస్టరీని ఛేదించారు.

avanigadda police have nabbed the accused in a case of murder of a man two years ago
హత్యకేసును ఛేదించిన అవనిగడ్డ పోలీసులు

By

Published : Oct 9, 2020, 2:56 PM IST

కృష్ణా జిల్లాలో రెండేళ్ల కిందట హత్యకు గురైన ఓ వ్యక్తి కేసును అవనిగడ్డ పోలీసులు చాకచాక్యంగా ఛేదించారు.

వివరాల్లోకి వెళితే...

చింతగుంట ధనలక్ష్మీ సోదరుడు లింగం రాజేంద్రప్రసాద్(54) కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని బొబ్బర్లంక గ్రామంలో నివశిస్తున్నాడు. ఇతనికి వివాహం కాలేదు. అయితే రాజేంద్రప్రసాద్ పేరుమీద కొంత పొలం ఉంది. ఆ భూమిని లింగం అనిల్ కుమార్ అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చాడు. అలా వచ్చిన కౌలు డబ్బులతో రాజేంద్రప్రసాద్ తీర్థయాత్రలకు వెళ్తుంటాడు. అయితే రెండు సంవత్సరాల నుంచి తన సోదరుడు కనిపించటం లేదని ధనలక్ష్మీ అవనిగడ్డ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి..దర్యాప్తు ప్రారంభించారు. సబ్ఇన్​స్పెక్టర్​లు సందీప్, సురేష్ రెండు బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు బొబ్బర్లంకలోని రాజేంద్రప్రసాద్ ఉంటున్న ఇంటికి వెళ్లారు. ఆ ఇల్లు శిథిలావస్థకు చేరి... పిచ్చి మెుక్కలు మెులచి ఉన్నాయి. అతని ఇంటిని పోలీసులు తనిఖీ చేయగా..పొలానికి సంబంధించిన పేపర్లు లభ్యమయ్యాయి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రాజేంద్రప్రసాద్ భూమిని లింగం అనిల్ కుమార్ అనే వ్యక్తి తనపేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లుగా ఉంది. లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు..మోపిదేవిలో రాజేంద్రప్రసాద్​కు 2.80 సెంట్లు భూమి ఉన్నట్లు పోలీసులు తేల్చారు..

పథకం ప్రకారం హత్య..

తమ పొలాన్ని అనిల్ కుమార్ కాజేస్తున్నాడని తెలిసే... రాజేంద్రప్రసాద్‌ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రాజేంద్రప్రసాద్‌ను అడ్డు తొలగించుకునేందుకు మరో నలుగురితో కలసి అనిల్ కుమార్ పథకం పన్నాడు. బొబ్బర్లంక గ్రామంలో రాజేంద్రప్రసాద్ ఇంటి వద్ద నిద్రిస్తున్న సమయంలో... సైకిల్ చైన్​తో మెడకు బిగించి చంపేశారు. మృతదేహానికి రాయి కట్టి కృష్ణానదిలో పడేశారు. దర్యాప్తులో లభించిన పత్రాలు, డైరీ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. నిందితులను రిమాండ్​కు తరలించారు. అవనిగడ్డ సబ్ ఇన్​స్పెక్టర్​ సురేష్ , సందీప్​సను ఉన్నతాధికారులు అభినందించారు.

ఇదీ చదవండి:

లారీని ఢీకొన్న కారు...ముగ్గురికి తీవ్ర గాయాలు

ABOUT THE AUTHOR

...view details