ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో వారం రోజుల్లో 347 కేసులు - కృష్ణా జిల్లాలో కొవిడ్ కేసులు వార్తలు

కృష్ణా జిల్లాను కరోనా పట్టి పీడిస్తోంది. రోజురోజుకీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత వారంలో 347 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం కేసుల్లో 60 శాతం జూన్​లోనే నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నా చాలామంది ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

corona cases in vijayawada
corona cases in vijayawada

By

Published : Jun 22, 2020, 6:13 AM IST

కృష్ణా జిల్లాలో కరోనా జడలు విప్పింది. ప్రతి రోజూ అధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఆదివారం ఒక్క రోజులో మరో 66 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో గత నాలుగు రోజుల్లో తొమ్మిది మంది వైరస్ బారినపడి మృతి చెందారు. కొత్తగా వచ్చిన కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1048కి చేరింది. వీరిలో 458 మంది డిశ్ఛార్జి అయ్యారు. మొత్తం 36 మంది ఇప్పటివరకూ వైరస్ బారినపడి మృతి చెందారు. కరోనా మరణాల్లో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉంది.
జూన్​లోనే అధికం

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య జూన్ ఆరంభం నుంచి జిల్లాలో విపరీతంగా పెరిగిపోయింది. జూన్ 1 నుంచి 21 వరకూ 583 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఈ నెల 15 నుంచి 21 వరకు 347 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో... 60 శాతం జూన్​లోనే నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా వస్తున్న కేసుల్లో 90 శాతం విజయవాడ నగరంలోనే ఉంటున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు జిల్లాలో ఎన్ని వచ్చాయి, ఎక్కడెక్కడ వచ్చాయనే వివరాలను జిల్లా అధికారులు గత నెల రోజులుగా బయట పెట్టడం లేదు. గత రెండు రోజులుగా జిల్లాలో వచ్చిన మొత్తం కేసుల సంఖ్యను మాత్రం వెల్లడిస్తున్నారు.

అయితే ఏంటి?
భారీగా కేసులు నమోదైన జిల్లాల్లో కర్నూలు తర్వాతి స్థానంలో కృష్ణా జిల్లా ఉంది. కానీ జనం మాత్రం సామాజిక దూరం పాటించట్లేదు. నడిరోడ్లపైనే మూత్రవిసర్జన, ఉమ్మివేయడం లాంటివి యథేచ్ఛగా చేస్తున్నారు. దుకాణాదారుల్లో సగం మంది మాస్కులే ధరించటం లేదు. నగరంలో తిరిగే ఆటోల్లో కిక్కిరిసిపోయి ప్రయాణాలు చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యమే కేసుల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారుతోంది.

ఇదీ చదవండి

రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు..ఐదుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details