విపత్తు నిర్వహణ కింద కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపదమిత్ర పథకంలో శిక్షణకు కృష్ణా జిల్లా ఎంపికైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సాయం అందించేందుకు దేశ వ్యాప్తంగా ఆరు వేల మంది కమ్యూనిటీ వాలంటీర్లను సిద్ధం చేయడంలో భాగంగా కృష్ణా జిల్లాను తొలివిడతలో ఎంపిక చేశారు. దేశ వ్యాప్తంగా తీర ప్రాంతాల్లోని 30 జిల్లాల్లో రెండు వందలు చొప్పున కమ్యూనిటీ వాలంటీర్లను సిద్ధం చేయాలని నిర్ణయించారు. వరదలు ఇతర విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం అందించేలా కమ్యూనిటీ వాలంటీర్లకు ఆపద మిత్ర పథకం కింద శిక్షణ ఇవ్వనున్నారు.
ఆపద మిత్ర పథకంలో కృష్ణా జిల్లా ఎంపిక - ఏపీ తాజా వార్తలు
విపత్తు సమయాల్లో తక్షణసాయం అందించేందుకు కమ్యూనిటీ వాలంటీర్లను సిద్ధం చేయాలని కేంద్రం ఆపదమిత్ర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో శిక్షణకు కృష్ణా జిల్లా ఎంపికైంది. వరదలు ఇతర విపత్కర సమయాల్లో ప్రజలకు సాయం అందించేలా ఆపదమిత్ర పథకం ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో 200 మంది కమ్యూనిటీ వాలంటీర్లను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వనున్నారు.
ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలోని 200 మంది కమ్యూనిటీ వాలంటీర్లను గుర్తించి శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ద్వారా కృష్ణా జిల్లాలో ఎంపికైన కమ్యూనిటీ వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమం చేపట్టనున్నారు. రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లో అత్యవసర పరిస్థితులు, వరద సమయాల్లో వేగంగా స్పందించేందుకు, సమాచారం చేరవేసేందుకు 9 జిల్లాల్లో హ్యామ్ రేడియో వ్యవస్థను విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి :ఎస్వీబీసీ నూతన కార్యాలయాన్ని పరిశీలించిన తితిదే ఈఓ