ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మిరపకు బొబ్బ తెగులు.. పంటను తొలగిస్తున్న రైతులు - కృష్ణా జిల్లా తాజా వార్తలు

కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో 25 వేల ఎకరాల్లో రైతులు మిర్చి పంటను సాగు చేశారు. దానికి బొబ్బ తెగులు సోకింది. పంట పూత, పిందె దశలో ఉండగా పైరును పూర్తిగా తొలగించాల్సి రావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

krishna dist farmers problems
పంటను తొలగిస్తున్న రైతులు

By

Published : Nov 4, 2020, 5:31 PM IST

కృష్ణా జిల్లాలో సాగు చేస్తున్న మిర్చి పంటకు బొబ్బ తెగులు సోకింది. దీంతో అన్నదాతలు తీవ్రనష్టాల ఊబిలో చిక్కుకున్నారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలోని చందర్లపాడు, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల్లో 25 వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగుచేశారు. నెలరోజులుగా పంటకు బొబ్బ తెగులు సోకింది. ఈ తెగులు మరింత వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పైరును పూర్తిగా తొలగించాల్సి వస్తోంది. ఇప్పటికే రైతులు ఎకరానికి రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టారు.

పంటను తొలగిస్తున్న రైతులు

పంట పూత, పిందె దశలో ఉండగా పైరును పూర్తిగా తొలగించాల్సి రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వత్సవాయి మండలం భీమవరం, మాచినేని పాలెం, మంగోల్లు, మక్కపేట గ్రామాల్లో పదుల ఎకరాల్లో మిర్చి పంటను రైతులు తొలగించారు. మరికొంత మంది తొలగించేందుకు సిద్ధంగా ఉన్నారు.

పంటను తొలగిస్తున్న రైతులు

ఇదీ చదవండి: రాజధాని రైతులపై పెట్టిన కేసులు తొలగించాలి: ఏపీ రైతు సంఘం

ABOUT THE AUTHOR

...view details