ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కాలుష్యంలో కాదు.. పరిష్కారంలో భాగం కండి' - ban

'కాలుష్యంలో కాదు.. పరిష్కారంలో భాగం కండి' అని కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా విజయవాడలో ప్లాస్టిక్​ను పూర్తిగా బ్యాన్ చేస్తున్నట్లు తెలిపారు.

'కాలుష్యంలో కాదు పరిష్కారంలో భాగం కండి'

By

Published : Jul 26, 2019, 12:10 PM IST

'కాలుష్యంలో కాదు పరిష్కారంలో భాగం కండి'

విజయవాడ నగరంలో ప్లాస్టిక్​ను పూర్తిగా బ్యాన్ చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కల్యాణ మండపాలు, రెస్టారెంట్స్, హోటల్స్, దుకాణాల వద్ద ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉందనీ.. దాని వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. దీనికోసం మంగళ, బుధ, శుక్రవారాల్లో ప్రజలతో సమావేశమవుతామన్నారు. ప్లాస్టిక్​కు ప్రత్యామ్నాయంగా కాటన్ క్లాత్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ వాడకంలోకి తీసుకొస్తామని వివరించారు. కార్పొరేషన్, పోలీస్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్​మెంట్ల సహకారంతో స్పెషల్ డ్రైవ్​లు నిర్వహిస్తామన్నారు. ప్లాస్టిక్ నివారణలో మీడియా, సామాజిక మాధ్యమాల సహకారం తీసుకుంటామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details