ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'16 మంది ఖైదీలకు 90 రోజుల మధ్యంతర బెయిల్​కు అర్హత' - కృష్ణా జిల్లా జడ్జి లక్ష్మణరావు వార్తలు

సుప్రీం మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో 16 మంది ఖైదీలకు 90 రోజుల మద్యంతర బెయిల్​కు అర్హత ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఖైదీలకు బెయిల్​కు సంబంధించిన అంశంపై జిల్లా న్యాయ సేవా అథారిటీ ఛైర్మన్, జిల్లా జడ్జి లక్ష్మణ రావుతో వర్చువల్ సమావేశం నిర్వహించినట్లు చెప్పారు.

collector intiyaaz
collector intiyaaz

By

Published : May 21, 2021, 8:15 PM IST

కొవిడ్ దృష్ట్యా.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో 16 మంది ఖైదీలకు 90 రోజుల మధ్యంతర బెయిల్​కు అర్హత ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు. న్యాయసేవా అథారిటీ ఛైర్మన్, ప్రిన్సిపల్ జడ్జి వై. లక్ష్మణరావు ఆధ్వర్యంలో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆ వివరాలను కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు.

ఐపీసీ-376, పోక్సో చట్టం కింద నేరస్తులు కాని వారిని గుర్తించి బెయిల్ బాండ్లను ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లాలోని నుజివీడు, కైకలూరు, గన్నవరం, నందిగామ, జగ్గయ్యపేట, మచిలీపట్నం పరిధిలోని సబ్ జైళ్లలో బెయిల్ అర్హత కలిగిన ఖైదీల వివరాలను కలెక్టర్ వెల్లడించారు.

ఇదీ చదవండి:పడకేసిన అంబులెన్స్​లు.. సామాజిక కార్యకర్తల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details