ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ముందు జాగ్రత్తలతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు' - 'ముందు జాగ్రత్తలు పాటించటం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు'

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు పాటించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన గోడ పత్రాలను ఆయన ఆవిష్కరించారు.

By

Published : May 2, 2020, 8:48 PM IST

కరోనా వైరస్ నియంత్రణపై అవగాహన కలిగించడంతో పాటు... వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన గోడ పత్రాలను కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆవిష్కరించారు. క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి పత్రాలను విడుదల చేసిన కలెక్టర్... అనంతరం ఆయనే స్వయంగా ప్రవేశ మార్గం వద్ద వాటిని గోడకు అంటించారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్తుచేసిన కలెక్టర్... ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలని సూచించారు. ముందు జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details