రెడ్‌జోన్ ప్రకటించిన ప్రాంతాల్లో కొవిడ్-19 పరీక్షలు - Kovid-19 tests areas declared by the Red Zone
రెడ్ జోన్ ప్రకటించిన నూజివీడు మున్సిపాలిటిలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు మంగళవారం ఉదయం 10 గంటలకు కొవిడ్-19 పరీక్షలు చేయనున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు.
రెడ్‌జోన్ ప్రకటించిన ప్రాంతాల్లో కొవిడ్-19 పరీక్షలు
కృష్ణా జిల్లా నూజివీడులో రెడ్‌జోన్ ప్రకటించిన ప్రాంతాల ప్రజలందరికీ మంగళవారం ఉచితంగా బీ ఫార్మసీ కళాశాలలో కొవిడ్-19 పరీక్షలు చేయనున్నారు. నమునాలను సేకరించి పరీక్ష కేంద్రాలకు పంపుతామని సబ్ కలెక్టర్ తెలిపారు. వీటి ఫలితాలు రెండు, మూడు రోజుల్లో తెలపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వృద్ధులతో పాటు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేసుకోవాలని కోరారు. పరీక్షలలో పాజిటివ్ కేసులు నమోదు కాకపోతే త్వరలోనే రెడ్‌జోన్ తీసివేసే అవకాశం ఉందని వెల్లడించారు.