'కోటేశ్వరమ్మ భర్త ప్రత్యక్ష రాజకీయాల్లోకి...' - eo koteswaramma
తెదేపా డిజిటల్ ప్రచార రథాలను కోటేశ్వరమ్మ భర్త శ్రీనివాసరావు ప్రారంభించారు. అధిష్ఠానం టికెట్ ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
విజయవాడ దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ భర్త శ్రీనివాసరావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశ పెట్టిన పథకాలను గ్రామస్థాయిలో తీసుకెళ్లేందుకు తయారు చేసిన రెండు ప్రచార రథాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారం మొదలు పెడతామని శ్రీనివాస్ చెప్పారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి నచ్చి... తెదేపా తరఫున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. అధిష్ఠానం టికెట్ ఇస్తే పోటీ చేస్తానని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.