ఈ నెల 31వరకు కృష్ణా జిల్లాలో కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్టు కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉండటంతో నిత్యావసరాల కొనుగోలుకు కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే రావాలన్నారు. నిర్దేశిత సమయంలోనే బయటకు రావాలని సూచించారు. ప్రభుత్వ సర్వీసు వాహనాలకు మాత్రమే 24 గంటల అనుమతి ఉంటుందన్నారు. మున్సిపల్ మైదానం, స్వరాజ్య మైదానంలో రైతుబజార్ నిర్వహిస్తామని తెలిపారు
'ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే కేసులు తప్పవు' - ap krishna district lock down news
రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
!['ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే కేసులు తప్పవు' కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6519107-518-6519107-1584978285464.jpg)
కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్
మీడియాతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్
ఇవీ చదవండి