ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Rahul Murder Case: పోలీస్‌ కస్టడీకి నిందితుడు కోరాడ విజయ్‌కుమార్‌

By

Published : Sep 6, 2021, 8:24 PM IST

Updated : Sep 6, 2021, 10:29 PM IST

Rahul murder case
Rahul murder case

20:19 September 06

Rahul murder case updates

రాహుల్ హత్య కేసులో నిందితుడు కోరాడ విజయ్‌కుమార్‌కు పోలీస్‌ కస్టడీ విధించింది కోర్టు. విజయ్‌కుమార్‌ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్‌కుమార్‌తో పాటు సీతయ్య, బాబురావులను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. వీరిని రెండ్రోజులపాటు విచారించనున్నారు. ప్రస్తుతం వీరంతా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. 

మరో నిందితుడు అరెస్ట్

మరోవైపు ఈ కేసులో  మరో నిందితుడిని అరెస్టు చేశారు. రాహుల్‌ హత్య కేసులో ఇప్పటివరకు 14 మంది అరెస్టు అయ్యారు. మరో ఐదుగురిని కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్‌ వేశారు.

రాహుల్ హత్య.. ఏం జరిగింది..

విజయవాడ మొగల్రాజపురం పరిధిలో గత నెల 19న రాహుల్ అనే వ్యక్తి తన కారులో హత్యకు గురయ్యారు. వ్యాపార వాటాల్లో వివాదమే హత్యకు కారణమని, వ్యాపార భాగస్వామి పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసులో నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. మృతుడి తండ్రి రాఘవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు.

కెనడాలో చదివిన కరణం రాహుల్‌.. స్వదేశానికి వచ్చాక.. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో సిలిండర్ల తయారీ కంపెనీ స్థాపించారు. ఇందులో ముగ్గురు భాగస్వాములున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరులో మరో కంపెనీకి శంకుస్థాపన చేశారు. పోరంకిలో వారు నివాసం ఉంటున్నారు. అత్యవసరంగా మాట్లాడాలని ఫోన్‌ రాగా బుధవారం రాత్రి 7.30 సమయంలో రాహుల్‌ కారులో బయటకు వచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోవారు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ అని వచ్చింది. తెల్లవారిన తర్వాతా ఇంటికి రాకపోయేసరికి, రాహుల్‌ తండ్రి రాఘవ.. పెనమలూరు పోలీసులకు చెప్పారు. ఇంతలో వైర్‌లెస్‌ సెట్లో మొగల్రాజపురంలో కారులో మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. మృతుడు రాహుల్‌ అని అతడి తండ్రి గుర్తించి, బోరున విలపించారు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు.. ఇప్పటికే పలువురుని అరెస్ట్ చేసింది.

Last Updated : Sep 6, 2021, 10:29 PM IST

ABOUT THE AUTHOR

...view details