ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

high security at Kondapalli municipality: కొండపల్లి పురపాలక కార్యాలయం వద్ద భారీ బందోబస్తు.. ర్యాలీగా బయలుదేరిన తెదేపా సభ్యులు - కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఏర్పాట్లు

కొండపల్లి పురపాలక కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కార్యాలయానికి వెళ్లే అన్ని రహదారులలో భారీ బందోబస్తు(high security at Kondapalli municipality) ఏర్పాటు చేశారు. కాసేపట్లో కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరుగనుంది. గొల్లపూడి నుంచి కొండపల్లికు తెదేపా కౌన్సిలర్లు బస్సులో బయలుదేరారు.

కొండపల్లి పురపాలక కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
high security at Kondapalli municipality

By

Published : Nov 22, 2021, 10:49 AM IST

కాసేపట్లో కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక(kondapalli municipal chairman election arrangements) జరుగనుంది. ఈ నేపథ్యంలో పురపాలక కార్యాలయం వద్ద పోలీసులను భారీగా మోహరించారు. నగర పంచాయతీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, వైకాపా చెరో 14 చొప్పున వార్డులు గెలుచుకోగా....స్వతంత్ర అభ్యర్థి తెదేపాకు మద్దతు తెలిపారు. ఏపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి.... తెదేపా బలం 16కు, వైకాపా బలం 15కు పెరిగింది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఛైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది.

అటు గొల్లపూడి నుంచి బస్సులో తెలుగుదేశం కౌన్సిలర్లు కొండపల్లికి బయలుదేరారు. ఎంపీ కేశినేని, దేవినేని ఉమా, కొనకళ్ల నారాయణ ఇతర తెలుగుదేశం నేతలు కౌన్సిలర్లతో కలిసి వస్తున్నారు. బస్సుకు రక్షణగా తెలుగుదేశం కార్యకర్తలు భారీ ర్యాలీగా ముందుకు సాగారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details