కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రసవత్తరంగా(Kondapalli Municipal Chairman election) మారుతోంది. సోమవారం ఎన్నిక జరగనుండటంతో గెలిచిన తెదేపా సభ్యులు దేవినేని ఉమా ఇంట్లో క్యాంపు ఏర్పాటు చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 29 వార్డులున్నాయి. ఇటీవల జరిగిన కొండపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో తెదేపా, వైకాపా.. 14 వార్డుల చొప్పున గెలుపొందాయి. మిగిలిన స్థానంలో గెలిచిన స్వతంత్య్ర అభ్యర్థి.. తెదేపాకు మద్దతునివ్వడంతో.. ఆ పార్టీ సీట్ల సంఖ్య 15కు పెరిగింది.
మరోవైపు స్థానిక ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్స్ అఫిషియో ఓట్లు వినియోగించుకోనున్నారు. దీంతో.. తెదేపాకు 16, వైకాపాకు 15 సీట్లు దక్కే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నేపథ్యంలో తెదేపా శ్రేణులు(Kondapalli Municipal TDP members camp at Devineni Uma's house).. అభ్యర్ధులను కాపాడుకునేందు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే క్యాంపు ఏర్పాటు చేశారు.