ETV Bharat / state
కొండపల్లి ఖిల్లా పండుగ - celebrations
ఈ నెల 3, 4 తేదీల్లో కృష్ణాజిల్లా కొండపల్లి కోటలో ఉత్సవాలు జరగనున్నాయి. కొండపల్లి చరిత్రను వివరించేలా త్రీడీ ప్రొజక్షన్ మ్యాపింగ్ ద్వారా రోజూ 2 షోలు ప్రదర్శించనున్నారు.


kondapalli-kota-
By
Published : Feb 2, 2019, 9:14 AM IST
| Updated : Feb 4, 2019, 5:26 PM IST
కృష్ణాజిల్లాలోని పచ్చని కొండల మధ్య ఉన్న కొండపల్లి కోట ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 3,4 తేదీల్లో జరిగే వేడుకలకు శరవేగంగా సిద్ధమవుతోంది. ప్రముఖ పర్యటక ప్రాంతంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పురావస్తు, ప్రదర్శన శాలల కమిషనర్ జి.వాణిమోహన్ తెలిపారు. రాజుల చిత్రాలతో గ్యాలరీని ఆకర్షణగా తీర్చిదిద్దామని చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ను రాజుల ఫోటోపై ఉంచితే- ఆ రాజు పరిపాలించిన కాలం ప్రత్యేకతలు అతని మాటల్లోనే వినిపించేలా అత్యాధునిక సాంకేతిక కల్పించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కార్యక్రమం ఉంటుందని చెప్పారు. కొండపల్లి చరిత్రను వివరించేలా త్రీడీ ప్రొజక్షన్ మ్యాపింగ్ ద్వారా రోజు 30 నిమిషాల నిడివిలో రెండు షోలు ప్రదర్శించనున్నారు. Last Updated : Feb 4, 2019, 5:26 PM IST