ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండపల్లి కోట...మాట్లాడుతోంది! - krishna district

అదేంటి కోట మాట్లాడుతుందనుకుంటున్నారా? అవును అక్కడికెళ్తే శిల్పాలు మాట్లాడతాయి. రాజులు తమ చరిత్ర తామే చెప్పుకుంటారు. వినడానికి వింతగా ఉన్న సాంకేతికతతో ఇది సాధ్యమైంది. ఇదెక్కడో కాదు... కృష్ణా జిల్లాలోని కొండపల్లి కోటలో. రాజుల కాలంలో సైన్యానికి శిక్షణ ఇచ్చిన ఈ ఖిల్లా...ఇప్పుడు పర్యటకులను రమ్మని పిలుస్తోంది.

కొండపల్లి కోట

By

Published : Feb 9, 2019, 7:33 AM IST

Updated : Feb 9, 2019, 8:32 AM IST

కొండపల్లి కోట
కొండపల్లి అనగానే గుర్తొచ్చేది బొమ్మలు... కానీ ఇక్కడ శతాబ్దాల నాటి చరిత్ర దాగి ఉందని ఎవరికీ తెలియదు. ఇక్కడ ఓ అద్భుత కట్టడం ఉంది. శిథిలావస్థకు చేరుకున్న ఈ కోటకు పురావస్తు శాఖ సాంకేతిక హంగులు అద్దుతోంది.

రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ ఖిల్లాను అద్భుత పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిరాదరణకు గురైన కొండపల్లి కోటను అధికారులు సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నీటి, విద్యుత్ సదుపాయాలు లేకున్నా కింది నుంచే మళ్లించి పనులు చేస్తున్నారు.
ఖిల్లాకు సంబంధించిన లేజర్‌షో ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులు అరగంట పాటు వీక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. పర్యటకులు ఆశ్చర్యపోయేలా... దర్బార్ హాల్‌లో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. సెంట్రల్ ఏసీ సదుపాయంతోపాటు వైఫై సౌకర్యాన్ని అందిస్తున్నారు.
గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఫొటోల్లో ఆగ్‌మెంట్ రియాలిటీ సాంకేతిక ఉంది. పర్యటకులు తమ స్మార్ట్ ఫోన్‌లో కొండపల్లి ఖిల్లాకు సంబంధించిన యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్ ద్వారా ఫొటోను స్కాన్ చేస్తే చాలు రాజులే...తమ చరిత్ర వివరిస్తారు. ఈ ఖిల్లా ఆధునికీకరణ పనులు సెంటిల్లా క్రియేషన్స్ సాంకేతిక సాయం అందిస్తోంది. ఇక్కడ శిల్పాలను ముట్టుకుంటే ప్రతిధ్వనిస్తాయి. వాటి చరిత్ర అవే చెప్పుకుంటాయి.

పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న కొండపల్లి కోటకు ప్రాణం పోశారు అధికారులు. సిమెంటు, ఇసుక వాడకుండా...రాజుల కాలంలో ఎలా నిర్మించారో...అలాంటి శాస్ర్తీయ విధానంతో కోట పునరుద్ధరించారు.

Last Updated : Feb 9, 2019, 8:32 AM IST

ABOUT THE AUTHOR

...view details