ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండపల్లి ఖిల్లా ఉత్సవాల్లో "పారా గ్లైడింగ్, హెలికాప్టర్ రైడింగ్" - కొండపల్లి ఖిల్లా ఉత్సవాలు

కొండపల్లి ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన పారాగ్లెడింగ్, హెలికాప్టర్ రైడింగ్ ను మంత్రి దేవినేని ఉమ, కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రారంభించారు.

కొండపల్లి ఖిల్లా ఉత్సవాల్లో "పారా గ్లైడింగ్, హెలికాప్టర్ రైడింగ్"

By

Published : Feb 3, 2019, 1:57 PM IST

కొండపల్లి ఖిల్లా ఉత్సవాల్లో "పారా గ్లైడింగ్, హెలికాప్టర్ రైడింగ్"
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కొండపల్లి ఖిల్లా ఉత్సవాల్లో భాగంగా పారా గ్లైడింగ్ హెలికాఫ్టర్ రైడింగ్ కార్యక్రమాన్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కృష్ణాజిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రారంభించారు. ఈ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే హార్స్ రైడింగ్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించారు. అమరావతి నగర ప్రజలకు కనువిందు చేసేందుకు చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మంత్రి దేవినేని తెలిపారు. భావి తరాలకు కొండపల్లి ఖిల్లా ఘనతను తెలిపేలా ఈ ఉత్సవాలను జరపాలని కోరారు. వివిధ శాఖల సమన్వయంతో సాంస్కృతిక కార్యక్రమాలను సాయంత్రం వేళల్లో ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీకాంతం వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details