ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బీసీలను అణగదొక్కేందుకే వైకాపా ప్రభుత్వం కుట్ర' - అచ్చెన్నాయుడు అరెస్టుపై కొనకళ్ల

అచ్చెన్నాయుడు అరెస్ట్ ను మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఖండించారు. అసెంబ్లీ సమావేశాల్లో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారనే భయంతోనే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారని విమర్శించారు.

konakalla narayana on achennaidu arrest
అచ్చెన్నాయుడు అరెస్టుపై కొనకళ్ల

By

Published : Jun 12, 2020, 6:57 PM IST

మాజీమంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌లు దుయ్యబట్టారు. బీసీలను అణగదొక్కేందుకు వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను గౌరవించే వ్యక్తిని పోలీసులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు.

రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారనే భయంతోనే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారని తెదేపా నేతలు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జీఎంఆర్​తో ప్రభుత్వం ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details