ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దొంగే.. దొంగా దొంగా అన్నట్లుంది కొడాలి నాని వ్యవహారం' - Konakalla Narayana comments on kodali nani

మంత్రి కొడాలి నానిపై మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ధ్వజమెత్తారు. రాజకీయ భిక్షపెట్టిన పార్టీకి, చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి దొంగే దొంగాదొంగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెదేపా హయాంలో పూర్తైన టిడ్కో ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేక చంద్రబాబుని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.

Konakalla Narayana criticize Kodal Nani over Tidco houses
కొనకళ్ల నారాయణ

By

Published : Nov 17, 2020, 3:24 PM IST

కొడాలి నాని మంత్రిగా కొనసాగాలంటే రోజూ చంద్రబాబుని విమర్శించాలనే ప్యాకేజీని వైకాపా ఇచ్చినట్లుగా ఉందని.. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ దుయ్యబట్టారు. నాని పదేపదే వెన్నుపోటు అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ భిక్షపెట్టిన పార్టీకి, చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి దొంగే దొంగాదొంగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విస్మరించి ఓట్లేసిన ప్రజలకు అయన వెన్నుపోటు పొడవలేదా అని ప్రశ్నించారు.

నాని మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పూర్తైన టిడ్కో ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేక చంద్రబాబుని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. లబ్ధిదారులను పెండిగ్​లో పెట్టి అనుకూలంగా మారాలంటూ బ్లాక్​ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అర్హుల ఎంపిక చట్టప్రకారం గతంలోనే జరిగితే, ఇప్పుడు కొత్త లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఎలా చెప్తారని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details