ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాలనలో విఫలమయ్యారు... వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు' - ప్రభుత్వంపై మండిపడ్డ కొనకళ్ల నారాయణ

పాలనలో అన్ని విధాలుగా విఫలమైన వైకాపా ప్రభుత్వం... వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని మాజీఎంపీ కొనకళ్ల నారాయణ మండిపడ్డారు. జగన్‌ పాలన తిరోగమనంలోకి వెళ్తోందని ఆక్షేపించారు. వ్యక్తిగత ధూషణలకు దిగుతున్న వైకాపాకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ

By

Published : Nov 22, 2019, 11:21 PM IST

పాలనలో అన్ని విధాలుగా విఫలమైన వైకాపా ప్రభుత్వం... వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని మాజీఎంపీ కొనకళ్ల నారాయణ మండిపడ్డారు. ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టమన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. ఇసుక, మద్యం పేరుతో వైకాపా నేతలు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తెదేపా పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందితే... జగన్‌ పాలనలో తిరోగమనంలోకి వెళ్తోందని ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details