ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బోటు ప్రమాదానికి ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణం' - Dharmadi satyam news

కచ్చులూరు బోటు ప్రమాదానికి ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ధర్మాడి సత్యం బృందం శ్రమించి బోటును బయటకు తీస్తే.. అది తమ ఘనతగా వైకాపా చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు. బోటు తీయడానికి 38 రోజులు సమయం పట్టడంపై ఆయన ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.

'బోటు ప్రమాదానికి ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణం'

By

Published : Oct 23, 2019, 12:53 AM IST

కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును బయటకు తీయడానికి 38 రోజులు పట్టడంపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బోటు బయటకు తీయడం తమ ఘనతగా మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ధర్మాడి సత్యం ముందుకొచ్చి తీయబట్టే ఐదు వారాల తర్వాత బోటు బయటపడిందన్నారు. బోటు ప్రమాదానికి వైకాపా ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణమన్నారు. 38 రోజుల పాటు బోటును గోదావరిలోనే వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం చేతకానితనం ఏంటో మునిగిన బోటును బయటకు తీయడంలోనే తేలిపోయిందన్నారు. మృతుల కుటుంబాల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

'బోటు ప్రమాదానికి ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణం'

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details