ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నియంత్రణ కన్నా ఎన్నికల ప్రచారం ముఖ్యమా?: కొల్లు - జగన్​పై కొల్లు రవీంద్ర కామెంట్స్

వైద్య పరికరాలు, ఇతర ఉత్పత్తులు తయారికీ అనుకూలమైన విశాఖ మెడ్​టెక్ జోన్​ను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు.. విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు సూచనలు చేస్తున్నా.. మంత్రులు విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహించారు.

kollu ravindra
kollu ravindra

By

Published : Apr 7, 2020, 2:35 PM IST

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

తెదేపా అధినేత చంద్రబాబు సూచనలు చేసిన ప్రతిసారి మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కరోనా వ్యాపిస్తున్న సమయంలోనూ ఇసుక, మట్టి, గ్రావెల్​ను దోచుకునేందుకు వైకాపా నాయకులకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మచిలీపట్నంలో కరోనా అనుమానితుడు చనిపోవడం ప్రభుత్వ వైఫల్యమే అని స్పష్టం చేశారు. అత్యవసర సేవలు అందించేవారికి సైతం మాస్కులు అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఇంత కష్టకాలంలోనూ వైకాపా రాజకీయాలు చేస్తుందన్నారు. ఆ పార్టీకి సమస్య పరిష్కారం కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యమా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details