ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

​'ఓటమి భయంతోనే ఓట్ల తొలగింపు' - jagan

ఓటమి భయంతోనే ఓట్ల తొలగింపునకు వైకాపా నేతలు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​తో కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రజలు ఓటుతో జగన్​కు బుద్ధి చెప్పాలని కోరారు.

కొల్లు రవీంద్ర

By

Published : Mar 6, 2019, 5:24 PM IST

కొల్లు రవీంద్ర
తెదేపా సానుభూతిపరుల ఓట్ల తొలగిస్తున్నారని ఆరోపిస్తూ.. మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో విజయవాడలో తెదేపా శ్రేణులు ధర్నా చేశాయి. ప్రతిపక్ష నాయకుడు జగన్.. కేసీఆర్​తో కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఓటమి భయంతోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా ఓటుతో జగన్​కు బుద్ధి చెప్పాలన్నారు. ధర్నా అనంతరం డీఆర్​ఓ ప్రసాద్​కు వినతిపత్రం అందజేశారు. ఓట్ల తొలగింపు వైకాపా పనే అని...ఆ పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details