ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా నేత కొల్లు రవీంద్ర అరెస్ట్‌.. కేసు నమోదు చేసి కోర్టుకు తరలింపు - Kollu Ravindra Arrested latest news

Kollu Ravindra Arrested
Kollu Ravindra Arrested

By

Published : Mar 11, 2021, 8:18 AM IST

Updated : Mar 11, 2021, 10:52 AM IST

08:17 March 11

ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని అభియోగం

కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలతో.. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నంలోని కొల్లు రవీంద్ర నివాసానికి ఉదయమే భారీగా చేరుకున్న పోలీసులు.. తెదేపా కార్యకర్తల నుంచి తీవ్ర ప్రతిఘటన అనంతరం ఆయన్ను స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రిపై 356, 506, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం జిల్లా కోర్టుకు తరలించారు.

'నోటీసు ఇస్తే నేనే వెళ్లేవాడిని.. జవాబు చెప్పేవాడిని'

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టుపై.. మచిలీపట్నం తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శివరాత్రి పూజలకు వెళ్దామనుకున్న కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డగించిన తీరును నిరసించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంట్లోకి వెళ్లి లాక్కుని వచ్చి అరెస్టు చేస్తున్నారని.. ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసులు వ్యవహరించట్లేదని తెలుగుదేశం నేతలు ఆగ్రహించారు. కొల్లు రవీంద్ర అరెస్టును ప్రతిఘటించిన కుటుంబసభ్యులను పోలీసులు అడ్డగించారు. ప్రతిసారీ ఇలానే వేధిస్తున్నారని.. నోటీసు ఇస్తే తానే స్టేషన్‌కు వచ్చి జవాబు చెప్పేవాడిని అని కొల్లు రవీంద్ర అన్నారు. 

అరెస్టుపై ఆగ్రహం

అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని.. కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఇదేం న్యాయం అని అడిగినందుకు తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. అరెస్టులకు భయపడేది లేదని.. న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

లోయలో పడ్డ బస్సు- 26మంది యాత్రికులు మృతి

Last Updated : Mar 11, 2021, 10:52 AM IST

ABOUT THE AUTHOR

...view details