ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాలకుల అసమర్థత వల్లే అధిక కేసులు' - kollu ravindra comments on cm jagan

పాలకుల అసమర్థత వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని... తెదేపా నేత, మాజీమంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కరోనాపై సీఎం జగన్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కరోనా జ్వరం లాంటిదే అయితే సీఎం జగన్ ఇల్లు వదిలి ఎందుకు బయటకు రావట్లేదని ప్రశ్నించారు.

kollu ravindra
kollu ravindra

By

Published : Apr 28, 2020, 10:35 PM IST

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డికి పాలన చేతకావట్లేదని... మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి వైకాపా నేతలే కారణమని ఆయన ధ్వజమెత్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి అదుపు చేయలేకపోతున్నారని మండిపడ్డారు. కరోనాపై సీఎం వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో సహజీవనం చేయడమేంటో జగన్​కే తెలియాలని విమర్శించారు. కరోనా జ్వరం లాంటిదే అయితే సీఎం జగన్ ఇల్లు వదిలి ఎందుకు బయటకు రావట్లేదని నిలదీశారు. లాక్​డౌన్​లో వైకాపా నేతలు రాష్ట్రమంతా ఊరేగుతున్నారని విమర్శించారు. మంత్రులు నోటిని అదుపులో పెట్టుకోవాలని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పూర్తి కరోనా కేసుల వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details