చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్క కష్టాలు, మరికొన్నింటిని ఓవర్సీస్లో చూసేందుకు ప్రేక్షకులకు ఇబ్బందులు... వీటికి పరిష్కారంగా త్వరలోనే ఓ సరికొత్త ఓటీటీ అందుబాటులోకి రానుంది. 4కే నాణ్యతతో ఇందులో సినిమాలు అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని నిర్మాతలకే కల్పించారు. ఓ ప్రవాసాంధ్రుడే దీన్ని రూపొందించడం విశేషం.
కొవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు... ఓటీటీల రుచి మరిగారు. భాషా భేదం లేకుండా ఏ సినిమా అయినా చూసేస్తున్నారు. ఓటీటీల్లో ప్రధానమైనవి ఒక ఐదారు ఉన్నాయి. వాటికి సబ్స్క్రిప్షన్ తప్పనిసరి. వీటికి పోటీగా... కొత్త విధానంతో మరో ఓటీటీ ప్లాట్‌ఫాం త్వరలోనే రానుంది. అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రుడు రంజిత్.... తన మిత్రుడు వెంకట్‌తో కలిసి హిట్ అనే ఓటీటీని రూపొందించారు. నిర్మాతలకు ఉపకరించేలా దీన్ని తీర్చిదిద్దారు. తమ సినిమాలను వారే అప్లోడ్ చేసి, టికెట్ ధరలు నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించారు.
ఈ ప్లాట్‌ఫాంలో రిలీజ్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చు. వాళ్లే మేనేజ్ చేసుకోవచ్చు. సో వాళ్లకి ఎక్కువ దేశాల్లో రిలీజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఆదాయం వచ్చే స్కోప్ ఉంది. ఎక్కువ మందికి రీచ్ అయ్యే స్కోప్ ఉంది. ఆంధ్రాలో థియేటర్లో రిలీజ్ చేసుకొని మిగతా చోట్ల ఓటీటీల్లో రిలీజ్ చేసుకోవచ్చు. సో వాళ్లకి ఎక్కువగా ఈ ప్లాట్‌ఫాం మూలాన వాళ్లకి చాలా బెనిఫిట్ ఉంటుందండి. రాని ఆదాయం రావడానికి స్కోప్ ఉంటుందండి. దీన్ని సెల్ఫ్ పబ్లిషింగ్ అంటున్నామండి. ఎన్ని రోజులు పబ్లిక్ చూడొచ్చు, ఎన్ని గంటలు చూడొచ్చు, ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు, ఏ టైం జోన్లో రిలీజ్ చేయొచ్చు... ఇండియన్ టైం జోనా? అమెరికన్ టైం జోనా? ప్రీబుకింగ్స్ కూడా వాళ్లే బుక్ చేసుకోవచ్చు. సినిమా రిలీజ్ అయ్యే ముందు ప్రీ బుకింగ్స్ అమ్మెటట్టు. - రంజిత్, 'హిట్' వ్యవస్థాపకుడు
విదేశాల్లో భారీ సినిమాలు మినహా ఓ మోస్తరు చిత్రాలు విడుదలవడం తక్కువే. ఒకవేళ అయినా సీట్లు నిండకపోతే షో రద్దు చేస్తారు. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాతలకు పెద్దగా ఏం మిగలదు. అదే.... 'హిట్'లో తమ సినిమాను విడుదల చేస్తే టికెట్ ధర నిర్ణయించే వీలు నిర్మాతలకే ఉంటుంది. ప్రస్తుతం 30 భాషల చిత్రాలను హిట్లో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. ఇందులో కొత్త సినిమాలకే ప్రాధాన్యమిస్తున్నట్టు రంజిత్ చెబుతున్నారు.