ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెల్లబోయిన నల్ల మీనం.. ఎగమతుల్లేక ఇక్కట్లు - కరోనా ప్రభావంతో నిలిచిన కొల్లేరు చేపల ఎగుమతులు

కొల్లేరు సరస్సు అనగానే ప్రకృతి అందాలతో పాటు నోరూరించే నల్లజాతి చేపలు గుర్తొస్తాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న కొల్లేరులో లభించే నల్లజాతి చేపలకు ఇతర రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉంది. అయితే కరోనా కారణంగా ఎగుమతులు నిలిచిపోయి కొల్లేరు వాసులు నష్టపోతున్నారు.

kolleru fishes exports stopped due to corona
కొల్లేరు చేపలు

By

Published : Apr 3, 2020, 7:17 PM IST

నల్లజాతిలో అత్యంత రుచికరమైన చేప కొరమీను. దీనికి కొల్లేరు ప్రాంతం నిలయంగా చెప్పవచ్చు. ఫిబ్రవరి నుంచి కొల్లేరులో నీటిమట్టం తగ్గుతూ వస్తోంది. కొల్లేటి గ్రామాల్లోని ప్రజలు సహజసిద్ధమైన వేట ద్వారా నల్లజాతి చేపలను పట్టుకుంటారు. ఏటా కొల్లేరులో మార్చిలో అడుగు పట్టుబడులు జరుగుతాయి.

ఈ ఏడాది కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో కొల్లేటి గ్రామాల్లోని నల్లజాతి చేపల ఎగుమతి లేక అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబరులో కొల్లేటి గ్రామాల్లో కిలో కొరమీను రూ.450 నుంచి రూ.500 ఉంటే ఇతర రాష్ట్రాల్లో కిలో రూ.600 నుంచి రూ.650 పలికేది. ఎగుమతి లేకపోవడంతో కొనుగోలు చేసేవారు లేనందున నల్లజాతి చేపల పట్టుబడులను ఏంచేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో కొల్లేటివాసులు ఉన్నారు. ప్రస్తుతం నల్లజాతి చేపలు కిలో రూ.350కి కూడా ఎవరూ కొనడం లేదని వాపోతున్నారు.

రవాణా లేక..

కొల్లేటి గ్రామాల్లోని పరిధులను గుర్తించి ఏటా వేల ఎకరాలకు నవంబరు నెలలో వేలం నిర్వహిస్తారు. వచ్చిన నగదులో కొంత భాగాన్ని గ్రామాభివృద్ధికి కేటాయిస్తారు. మిగిలిన మొత్తాన్ని ఇంటికి కొంత చొప్పున పంచుకుంటారు. వేలం పాడిన వ్యక్తి మార్చిలో పట్టుబడులు చేపడతారు. లాక్‌డౌన్‌తో ఎగుమతులు నిలిచిపోవటంతో పట్టుబడులు చేయలా వద్దా అనే అయోమయంలో పడ్డారు.

కొరమీనుతో రూ.కోట్లు

ఏటా కొల్లేటి వాసులు కొరమీనును ఎగుమతి చేసి రూ.కోట్లు గడిస్తున్నారు. రాష్ట్రంలోనే కొల్లేరు ప్రాంత కొరమీనుకు గిరాకీ అధికంగా ఉంటుంది. దీంతో ఒక్కో సమయంలో కిలో రూ.900 పలికిన రోజులు కూడా ఉన్నాయి. రోజూ వివిధ రాష్ట్రాల్లోని మార్కెట్లకు ఎగుమతి అయ్యే కొరమీనుతోపాటు బొమ్మిడాయి. వాలుగ, ఇంగిలాయి, మట్టగిడస, నాటు గొరక, మార్పు వంటి రకాలు సైతం నిలిచిపోయాయి. గతంలో రూ.కోట్లు ఆర్జించిపెట్టిన కొరమీను ఈ ఏడాది డీలాపడిపోయింది. ఎగుమతులు లేక నిలిచిపోయిన సరకు చూసి కొల్లేరు వాసులు బావురుమంటున్నారు.

ఇవీ చదవండి:

ఆపత్కాలంలో కేంద్ర సాయం.. అందుకో నేస్తం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details