మాజీ మంత్రి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమార్తె కోడెల విజయలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. గుంటూరు జిల్లా నర్సరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో తనపై నమోదైన నాలుగు కేసుల్లో 41ఏ సీఆర్ పీసీ కింద నోటీసులు జారీ చేసే విధంగా పోలీసులను ఆదేశించాలని కోడెల విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ..సంబంధిత నాలుగు కేసుల్లో 41 ఏ సీఆర్ పిసీ కింద పిటిషనర్‌కు నోటీసులు జారీ చేసి విచారించాలని పోలీసులను ఆదేశించింది.
కోడెల కుమార్తె విజయలక్ష్మికి హైకోర్టులో ఊరట - kodela daughter gets relief at ap highcourt
కోడెల శివప్రసాద్ కుమార్తెకు హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన నాలుగు కేసులపై 41ఏ సీఆర్ పీసీ కింద నోటీసులు జారీ చేసి విచారించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.
కోడెల కుమార్తెకు హైకోర్టులో ఊరట