రాష్ట్రంలో పెట్టుబడుల సదస్సులకు బదులుగా పేకాట శిబిరాలు నిర్వహించటం సిగ్గుచేటని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు ఎద్దేవా చేశారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ రద్దు చేసిన ప్రభుత్వం... బహిరంగ ఆడేందుకు మాత్రం అనుమతులు ఇస్తోందని ఆరోపించారు. జూదరులకు భరోసా ఇచ్చేలా కొడాలి నాని వ్యాఖ్యలున్నాయని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి జగన్కు చిత్తశుద్ధి ఉంటే కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డికి కూడా జూదాల్లో వచ్చే ఆదాయంలో వాటాలున్నాయని నాగ జగదీశ్వరరావు అన్నారు.
'పెట్టుబడుల సదస్సులకు బదులుగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు' - ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు వార్తలు
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో పేకాట శిబిరాలపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు మండిపడ్డారు. ఆయనను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
mlc buddha naga jagadish