'మీ పిల్లల్ని చదవించండి... ఖర్చు మేము భరిస్తాం' - government schools
రాష్ట్రంలో చాలా మంది చిన్నారులు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరమవుతున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అలాంటి సమస్యలు ఉండవని... ప్రతి చిన్నారని చదివించే బాధ్యత తమదని చెప్పారు.
ఏపీలో 33 శాతం నిరక్షరాస్యత ఉందని దాన్ని సరిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. కృష్ణాజిల్లా గుడివాడ ఏజీకే పాఠశాలలో నిర్వహించిన "రాజన్న బడి బాట" కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారులతో అక్షరాభ్యాసం చేపించి అనంతరం పుస్తకాలు ,దుస్తులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల కుటుంబాలకు అమ్మ ఒడి పథకం కింద 15000 రూపాయలు అందజేస్తామని తెలిపారు. రెండు సంవత్సరాల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ బడులకు పంపితే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మంత్రి కొడాలి నాని వివరించారు.