రాష్ట్రంలోని అవసరమైన అన్ని గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం పెంజేండ్ర గ్రామంలో 15 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామా పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత రైతులకు రాయితీపై వరివిత్తనాలు పంపిణీ చేశారు.
గ్రామ సచివాలయాలుగా పంచాయతీలు - kodali nani
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను గ్రామ సచివాలయాలుగా మారుస్తామని రాష్ట్ర పౌరసరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. నూతన సంస్కరణలను శరవేగంగా చేపడతామని చెప్పారు.
పంచాయతీలను గ్రామ సచివాలయాలుగా మార్పుచేసి ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా చేస్తామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్, నిత్యావసర సరుకులు, గృహ నిర్మాణాలతోపాటు అన్ని పథకాలకు సంబంధించిన పనులను గ్రామ సచివాలయ వలంటీర్లు పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు. ఆగస్టు 15 నుంచి వలంటీర్లను నియమిస్తామన్నారు. ప్రజలు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసిన 72 గంటల్లో వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వలన అభివృద్ది కుంటుపడిందన్నారు.
ఇదీ చదవండి...'బద్వేల్ తాగునీటి పథకం అభివృద్ధి చేయండి'