ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దళితులు, దేవాలయాలపై దాడులు చేసేది తెలుగుదేశం పార్టీయే' - చంద్రబాబుపై కొడాలి నాని కామెంట్స్

తెదేపానే దాడులు చేయించి... ప్రభుత్వంపై నిందలు వేస్తోందని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగానే దాడులు చేస్తూ... ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంపీ బాలశౌరితో కలిసి కొడాలి నాని గుడివాడలో మీడియాతో మాట్లాడారు.

Kodali Nani FiresOn chandrababu over attacks on temples
మంత్రి కొడాలి నాని

By

Published : Sep 29, 2020, 7:14 PM IST

దళితులు, దేవాలయాలపై తెలుగుదేశం పార్టీయే దాడులు చేయించి.. వైకాపా ప్రభుత్వంపై బురద జల్లుతోందని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి క్యాంపు కార్యాలయంలో.. మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు బాలశౌరితో సమావేశమయ్యారు. మచిలీపట్నం పరిధిలోని 7 నియోజకవర్గాల అభివృద్ధిపై మంత్రి కొడాలి నాని, బాలశౌరి చర్చలు జరిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు తెలుగుదేశం పార్టీయే కారణమని మంత్రి కొడాలి నాని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details