కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని గుడ్లవల్లేరు మండలంలో వైకాపా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థి ఉప్పాల హారికతో కలిసి మంత్రి కొడాలి నాని ప్రచారంలో పాల్గొన్నారు. మండలంలోని కౌతవరం, డోకిపర్రు గ్రామాల్లో నాని విస్తృతంగా పర్యటించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైకాపా ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
పరిషత్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కొడాలి నాని - మంత్రి నాని పరిషత్ ఎన్నికల ప్రచారం
కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో మంత్రి నాని పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైకాపా అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
![పరిషత్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కొడాలి నాని kodali nani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11283760-466-11283760-1617606166290.jpg)
పరిషత్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కొడాలి నాని