ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాళ్లు ఎలా పోటీ చేసినా.. మాకు 151 సీట్లు ఖాయం: కొడాలి నాని - పవన్​పై కొడాలి కామెంట్స్

జనసేన అధినేత పవన్ ఇటీవల చేసిన పొత్తు వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. పవన్, చంద్రబాబు కలిసి పోటీ చేసినా.. విడిగా పోటీచేసినా.. వైకాపా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు. వైకాపాకు మళ్లీ 151 సీట్లు పక్కాగా వస్తాయని జోస్యం చెప్పారు.

వాళ్లు ఎలా పోటీ చేసినా.. వైకాపాకు 151 సీట్లు ఖాయం
వాళ్లు ఎలా పోటీ చేసినా.. వైకాపాకు 151 సీట్లు ఖాయం

By

Published : May 11, 2022, 3:57 PM IST

వచ్చే ఎన్నికల్లో వైకాపాకు మళ్లీ 151 అసెంబ్లీ సీట్లు రావటం ఖాయమని.. మిగిలిన 24 సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాడతాయని మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని జోస్యం చెప్పారు. పవన్, చంద్రబాబు కలిసి పోటీ చేసినా.. విడిగా పోటీచేసినా.. వైకాపా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో నిర్వహించిన 'గడప గడపకు ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని 22వ వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రజాసమస్యలు తెలుసుకున్నారు.

మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశాన్నీ అమలు చేసిన వైకాపా ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేక ఓటూ లేదని కొడాలి అన్నారు. పవన్ పొత్తు వ్యాఖ్యల్లో ఎటువంటి లాజిక్ లేదని చెప్పారు. చంద్రబాబు తన కొడుకు, మనవడిని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ.., పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందకుండా కోర్టులకు వెళ్తున్నాడని మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి పురస్కారాలు పొందిన వాలంటీర్లను కొడాలి సత్కరించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details