పవన్ కల్యాణ్ విశాఖ సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. పవన్ కల్యాణ్ ఉద్యమం చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నామని.. జ్ఞానోదయం కలిగి విశాఖ ఉక్కు పరిరక్షణకు మందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలో డెడ్ పార్టీ జనసేన.. మాకు డెడ్ లైన్ ఏం పెడుతుందని మంత్రి ప్రశ్నించారు. దైర్యముంటే.. ప్రధాని మోదీకి డెడ్‌లైన్ పెట్టాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో చచ్చిపోయిన పార్టీలు తెదేపా, జనసేన డెడ్లైన్లకు తాము భయపడమని కొడాలి విమర్శించారు.
Kodali nani: 'పవన్‌కు ధైర్యముంటే..ప్రధాని మోదీకి డెడ్‌లైన్ పెట్టాలి' - yscp comments on kodali nani
రాష్ట్రంలో డెడ్ పార్టీ జనసేన తమకు డెడ్ లైన్ ఏమీ పెడుతుందని మంత్రి కొడాలి నాని అన్నారు. జనసేన డెడ్లైన్లకు తాము భయపడమని కొడాలి స్పష్టం చేశారు.
kodali nani