ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కేసులు ఉపసంహరించుకోండి.. టిడ్కో ఇళ్లు పంచుతాం'

By

Published : Nov 11, 2020, 4:11 PM IST

పేదల ఇళ్ల స్థలాల పంపిణీ అడ్డుకునేందుకు న్యాయస్థానాల్లో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తెచ్చిన స్టేలు వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు. చేసిన తప్పును ఒప్పుకుని స్టే వెకెట్ చేస్తే వచ్చే డిసెంబర్ 21 నే 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు సహా టిడ్కొ ఇళ్లను పంపిణీ చేస్తామని తెలిపారు.

ఇళ్ల స్థలాల పంపిణీ అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు: కొడాలి
ఇళ్ల స్థలాల పంపిణీ అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు: కొడాలి

30 లక్షల ఇళ్ల పట్టాలు సహా 2 లక్షల టిడ్కో ఇళ్లు ఒకేసారి పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే ..గంటకు కోట్లు తీసుకునే లాయర్లు పెట్టి పేదలకు ఇళ్లు రాకుండా స్టేలు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు అని కొడాలి నాని ఆక్షేపించారు. లాయర్ల కోసం 25 కోట్లు ఖర్చు పెట్టి పేదల ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు స్టే ఆర్డర్లు తెచ్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్​పై విమర్శలు చేస్తే తగిన శాస్తి చేప్తామని కొడాలి హెచ్చరించారు. చంద్రబాబు హూందాగా ఉండాలని సూచించారు. నంద్యాలలో ముస్లిం కుటుంబం ఆత్మహత్య ఘటనలో సీఎం వెంటనే చర్యలు తీసుకున్నారని , ఆరోపణలు ఉన్న పోలీసులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details