ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజలు సరైన నాయకుడిని ఎన్నుకోవాలి' - జీహెచ్​ఎంసీ ఎన్నికలు 2020

రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ఓటు వేసే హక్కు కల్పించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

central minister kishan reddy
ప్రజలు సరియైన నాయకుడిని ఎన్నుకోవాలి

By

Published : Dec 1, 2020, 12:10 PM IST

ప్రజలు సరియైన నాయకుడిని ఎన్నుకోవాలి

తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాచిగూడలోని దీక్షా మోడల్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో... సతీమణి కావ్యతో కలిసి ఓటు వేశారు.

డాక్టర్​ బాబా సాహెబ్​ అంబేద్కర్​ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ ఓటు వేసే హక్కు ఉందని చెప్పారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వాలు సరిగా పని చేయడం లేదని ప్రశ్నించడం కాదు. మంచి ప్రభుత్వాలు వచ్చే విధంగా సరియైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details