చూపరులను కట్టిపడేసిన కిడ్స్ ఫ్యాషన్ షో - KIDS FASHION SHOW
విజయవాడ వేదికగా జరిగిన కిడ్స్ ఫ్యాషన్ షో లో బుడిబుడి అడుగులతో చిన్నారులు ర్యాంప్‌ను రఫ్ఫాడించారు. క్యూట్ లుక్‌తో కేక పుట్టించారు. మొత్తానికి కార్యక్రమానికే నిండుదనం తీసుకొచ్చి అదరహో అనిపించారు.
విజయవాడ వేదికగా జరిగిన కిడ్స్ ఫ్యాషన్ షో చూపరులను కట్టిపడేసింది. బుజ్జాయిలంతా చేసిన సందడితో వచ్చిన వారంతా ఫిదా అయిపోయారు. కళాశాలల్లో డిగ్రీ, డిప్లొమా చదువుతున్న విద్యార్థులంతా తమ ప్రాజెక్టులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. వినూత్నమైన దుస్తులతో ర్యాంప్‌పై చిన్నారులు నడిచి వస్తుంటే ఆ ప్రాంగణమంతా చప్పట్లతో హోరెత్తిపోయింది. ప్రభుత్వం ఫ్యాషన్ డిజైనింగ్‌ను పరిశ్రమగా గుర్తించాలన్న డిమాండ్‌తో కొండపల్లి ఖిల్లాపై ఓ కార్యక్రమం చేయనున్నట్టు నిర్వహకులు తెలిపారు.