విజయవాడ కమిషనరేట్ పరిధిలో పెద్దమొత్తంలో ఖైనీ ప్యాకెట్లు పట్టుకున్నారు. రూ.18 లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్లు, రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయనగరం జిల్లాకు తరలిస్తుండగా విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేసి లారీ స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడలో భారీగా ఖైనీ ప్యాకెట్ల పట్టివేత
విజయవాడ కమిషనరేట్ పరిధిలో రూ.18 లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయనగరం జిల్లా తరలిస్తుండగా ట్సాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఆరుగురిని అరెస్టు చేసి లారీని స్వాధీనం చేసుకున్నారు.
సీపీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్సు ఏడీసీపీ కేవీ.మోహనరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేశారు. ఒడిశా రాయగడకు చెందిన ఇనుకోలు రవికుమార్ ఈ సరకును హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అతనితోపాటు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఏలూరుకి చెందిన సతీశ్, జీఎస్‌టీ బిల్లుపై లావాదేవీలు పర్యవేక్షించే విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన ద్వారపూడి స్వామినాయుడు, లారీ డ్రైవర్లు కృష్ణ, కిరణ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,555 కరోనా కేసులు నమోదు