స్థానిక సంస్థల ఎన్నికల నుంచే తెదేపా గెలుపు ప్రారంభం అవుతుందని నియోజకవర్గాల వారీ సమావేశంలో ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు. జగన్ ఒక్క అవకాశం మాత్రమే అడిగారని.. ఆయన కోరిక మేరకు ప్రజలు అవకాశం ఇచ్చారని తెలిపారు. 5 నెలల్లోనే జగన్ పనితీరు అర్థం అయిపోయిందన్నారు. తెదేపాలో ప్రతీ కార్యకర్త ఒక పులిలాంటి వాడన్న నాని... కేసులకు, రౌడీయిజానికి, ఫ్యాక్షనిజానికి భయపడరని తేల్చి చెప్పారు. ఇబ్బందులు, బాధలనేవి మాములేనని... దమ్ముతో అధిగమించేవాడే తెదేపా కార్యకర్త అని అన్నారు. బుర్ర ఉన్నవాళ్లేవరూ... చంద్రబాబు అభివృద్ధి పనులు ఆపరని.. ప్రభుత్వం తెలివితక్కువ చర్యలతో అభివృద్ధిని ఆపేశారని కేశినేని నాని విమర్శించారు.
'తెదేపాలో ప్రతీ కార్యకర్త ఒక పులిలాంటి వాడు'
కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటనలో భాగంగా జరిగిన నియోజకవర్గాల వారీ సమావేశంలో ఎంపీ కేశినేని నాని మాట్లాడారు.
'తెదేపాలో ప్రతీ కార్యకర్త ఒక పులిలాంటి వాడు'