ఇదీ చూడండి
'ప్రజల కోసం పనిచేయండి.. పాలకుల కోసం కాదు'
రాజధాని అమరావతి కోసం నిరసన చేస్తున్న మహిళల పట్ల రాష్ట్ర పోలీసుల తీరును విజయవాడ ఎంపీ కేశినేని నాని తప్పుబట్టారు. అమానుషంగా 3 వేల మంది మహిళలను మగ పోలీసులతో కొట్టడం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సేవ్ అమరావతి' పేరుతో విజయవాడలో ఏర్పాటు చేసిన దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదన వెనక్కి తీసుకునే వరకూ... పోరాటం ఆగదని కేశినేని హెచ్చరించారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని పాలకుల కోసం కాదని సూచించారు.
రాష్ట్ర పోలీసులపై మండిపడ్డ కేశినేని నాని