Telangana TDP New President: తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ పగ్గాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెదేపా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
తెలంగాణ తెదేపా అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతల స్వీకరణ - తెదేపా తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్
Telangana TDP New President: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ పగ్గాలు చేపట్టారు.
అంతకుముందు రాష్ట్ర తెదేపా అధ్యక్షుడిగా నియమితులైన కాసాని జ్ఞానేశ్వర్.. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్ద అమర వీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట ర్యాలీగా పెద్ద సంఖ్యలో తెదేపా నాయకులు తరలివచ్చారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించి.. తెదేపా కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల చంద్రబాబు ఆధ్వర్యంలో జ్ఞానేశ్వర్ సైకిలెక్కిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులుకు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు.
ఇవీ చదవండి: